మహా వెలుగు రామగుండము 01: సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630 /1982 ఆధ్వర్యంలో దుర్గం శంకర్ కి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రామగుండం1, జిడికె11ఇంక్లైన్ గనిపై శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీగా తోగరి భాస్కర్ (ఫిట్ సెక్రెటరీ ) కోరే శంకర్(అసిస్టెంట్ సెక్రటరీ), మిట్టపల్లి వెంకటేష్ (సెక్రటరీ), ముడుసు రమేష్ (అడ్వైజర్) ఎన్నుకున్నారు. జనగామ నర్సయ్య(వైస్ ప్రెసిడెంట్ ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పులి మోహన్, అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాట ఓదేలు, కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆరేపల్లి రామ్ చందర్, సెక్రటరీ బడికెల కృష్ణ, ఏరియా కమిటీ సభ్యులు దుర్గం తిరుపతి, 2ఇంక్లైన్ ఫిట్ సెక్రెటరీ ఈదునూరి శ్రీనివాస్, గుర్తింపు సంఘం సెక్రెటరీ నాయిని శంకర్, వడ్డేపల్లి శంకర్, తిరుపతి, కుక్కల శ్రీనివాస్, దారా సదానందం, కనకరాజు, వివిధ సంఘాల కార్మిక నాయకులు కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
