ఘనంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టారని తెలిపారు. యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు. దేశం కోసం బలిదానం చేసిన రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ ఇంచార్జ్ తూముల నరేష్ ,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.