ఘనంగా నల్ల పోచమ్మ బోనాలు.


మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణ జన్నారం జూన్ 3 :మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో ఆదివారం రోజున మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణ శివారులోని వీరుల గుట్ట సమీపాన వెలిసిన నల్ల పోచమ్మ తల్లి కి అధిక సంఖ్యలో హాజరై బోనాలు సమర్పించారు ప్రతి ఏటా ఆషాడమాస ప్రారంభంలో ఇలా అమ్మవారివి బోనాలు సమర్పిస్తూ జాతర నిర్వహిస్తూ ఉంటారు ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు కరోనా కష్ట కాలం నుండి బయటపడి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చల్లగా చూడమ్మా అని భక్తులు నల్ల పోచమ్మ తల్లిని వేడుకుంటూ నైవేద్యాలు సమర్పించారు అనంతరం మేకపోతులను బలి ఇస్తు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యకమంలో జన్నారం మండల మహేంద్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.