గిరిజనులకు 10% రిజర్వేషన్ సాధించేవరకు ఏస్టి సంఘాల ఐక్యత తగ్గేదే లేదు

ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్ రామ్ నాయక్

వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 23 :  లంబాడి హక్కుల   సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పి ఎన్ ఫంక్షన హాల్ లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక ద్వారా  సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో దాస్ రాం నాయక్ మాట్లాడుతూ…. గిరిజనులకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ సాధించేవరకు ఎస్టీ సంఘాలు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమం ప్రకటిస్తామని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులకు ఆరు శాతం నుండి  10 శాతం రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గిరిజనులను తీవ్రస్థాయిలో మోసం చేశారని, రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని లేకుంటే గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు.
జి. వో. 3 ను,రద్దు చేసిన ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని, గిరిజన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ ప్రభుత్వానికి బానిసత్వం చేస్తున్నారని అన్నారు.  సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజన ప్రాంతంలో ఇసుక మాఫియా, భూ దందాలు, భూ కబ్జాలు జరుగుతూన్న ఎస్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడం లేదని, సరైన సమయంలో గిరిజన ఉద్యమం ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరించారు మే 30న, చలో హైదరాబాద్, ధర్నా, ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేశారు.