గ్లైసిల్ పత్తి విత్తనాలు ఒచ్చాయ్…. ? ఓచ్ ..

  • ఇప్పటికే భీమారo మండలానికి చేరిన కల్తీ పత్తి విత్తనాలు
  • రైతుల నుండి భారీ వసూళ్లు
  • 100 ఎకరాలు , 200 ఎకరాలు కౌలుకు తీసుకునే రైతుల వద్ద పెద్ద ఎత్తున కల్తీ నకిలీ పప్పీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం

మహా వెలుగు ,మంచిర్యాల ( భీమారo ) 10 : గ్లైసిల్ (కల్తీ పత్తి విత్తనాలు) భీమారo మండలానికి చేరుకున్నాయి. భీమారo మండలానికి గత 10 రోజుల క్రితమే ఓ ఇద్దరి , ముగ్గురు దగ్గరకు  ఈ విత్తనాలు రాగా వారు బహిరంగంగానే వారు క్రయ విక్రయాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారo

పాత చిత్రం

భీమారo  లొనే పెద్ద ఎత్తున గ్లైసిల్ అమ్మకాలు

భీమారo మండల వ్యాప్తంగానే ప్రతి సీజన్ లో పెద్ద ఎత్తున గ్లైసిల్ విత్తనాలను అమ్ముతున్నారు. ఇప్పటికే గ్లైసిల్ విత్తనాలు మండలo తో పాటు వివిధ గ్రామాలకు చేరుకున్నాయి.

భీమారo  లో సాగు భూములు ఇక్కడ ఎక్కువ  ఉన్నాయి కాబట్టి ఇక్కడ కౌలుకు పట్టె రైతులు  100 ఎకరాల నుండి 200 ఎకరాలు పడుతుంటారు. వేరే విత్తనాలు వేయాలంటే ఖర్చు తో కూడుకున్న పని కాబట్టి రైతుల తో పాటు ,కౌలు రైతులు సైతం ఈ గ్లైసిల్ విత్తనాల పై మొగ్గు చూపుతున్నారు.

గ్లైసిల్ విత్తనాల అమ్మకాల్లో పెద్దల ఆస్తం

గ్లైసిల్ విత్తనాల అమ్మకాల్లో పెద్దల ఆస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అధికార పార్టీ కి చెందిన భర్త , తో పాటు గతంలో గ్లైసిల్ విత్తనాలు అమ్మి పట్టుబడిన వ్యక్తులు , ఆంధ్ర నుండి  వచ్చి ఇక్కడ నివాసం ఉండే వ్యక్తులతో పాటు ఓ వార్డు సభ్యుని కుటుంబ సభ్యులు , మద్దికల్ గ్రామంలో ఆర్ధికంగా ఉన్న ప్రభుత్వ విధులు నిర్వహించే  ఓ మహిళ వద్ద , అదే గ్రామంలో ఆసరా పింఛన్ ఇచ్చే కుటుంబ సభ్యుల వద్ద ,  ఎల్ బి పెట్ గ్రామంలో వడ్ల కొనుగోలు చేసే దళారి వద్ద అధిక సంఖ్యలో ఈ విత్తనాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం  వీరు ఇప్పటికే రైతులకు విక్రయాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అధికారులకు తెలిసిన దాడులు కరువు

ఇంత జరుగుతున్నా మాత్రం సంబంధించిన అధికారులకు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. అధికారులకు తెలిసిన పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక శాతం జిల్లా లొనే గ్లైసిన్ విత్తనాలు ఇక్కడే అమ్ముతారని కానీ ఇక్కడ దాడులు శూన్యం అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర నుండి గ్లైసిల్ వాడే మందు

మహా రాష్ట్ర నుండి గ్లైసిల్ వాడే మందు  ను తెలంగాణ కు తీసుకుని వస్తున్నారు. మహారాష్ట్ర లోని స్థానికి సిరివంచలో దీనికి అనుమతులు ఉండగా  అధికారంగా అమ్ముతున్నారు. అక్కడ నుండి ద్విచక్ర వాహనంపై ,ఆటోలో పై ,కార్ ల పై glyphosate మందులను తరలిస్తున్నారు.

ఫైల్ ఫోటో