గొల్లవాగు ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని స్థానిక పోతనపల్లి శివారులో గొల్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉండడంతో , పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో లో గడిపి వెళ్తున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ ,తో పాటు మహారాష్ట్ర నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం గడిపి భోజనం చేసి వెళ్తుంటారు. గొల్లవాగు కింద దట్టమైన మామిడి చెట్లు ఉండడంతోపాటు అటవీ ప్రాంతం దానికి అనుకుని ఉంటుంది. అంతేకాకుండా కొండలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గొల్లవాగు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగులు, ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు, సీరియల్స్ పాటల చిత్రీకరణ ఇక్కడ జరుగుతుంది. అంతేకాదు భీమారం గ్రామపంచాయతీ 14 వార్డులు ఉండగా పోతనపల్లి గ్రామం 14 వార్డులో వస్తుంది. ఇక్కడే రైతులకు చెందిన అత్యధిక పొలాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో గొల్ల వాగు ప్రాజెక్ట్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించారు. ఈ నిర్మాణంలో పోతనపల్లి గ్రామం తో పాటు భీమారo గ్రామానికి చెందిన రైతులది, అత్యధిక భూమి కోల్పోయారు. ఈ ప్రాజెక్టును రోజుకు వందల సంఖ్యలో వచ్చి తిలకించి వెళ్తారు. గొల్లవాగు మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఇక్కడ ప్రజలు సైతం గట్టిగా కోరుతున్నారు. భీమారం మండల వ్యాప్తంగా 11 గ్రామ పంచాయతీలు ఉండగా ఇక్కడ అత్యధిక శాతం రైతులు పంటలను వేసుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన అడవి తో పాటు పచ్చని పొలాలతో నిండి ఉంటుంది. గొల్లవాగు ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తారు. అంతే కాకుండా సిద్దిపేట లోని కోమటి చెరువును అభివృద్ధి చేసినట్లు ఇక్కడ గొల్లవాగు ను అభివృద్ధి చేస్తే అటు ప్రభుత్వం కు ఆదాయo సమకూరుతుంది. ఇక్కడ ప్రజలే కాకుండా ఉమ్మడి మండల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు.