మహా వెలుగు,మంచిర్యాల,ఆగష్టు 05:జైపూర్ మండలంలోని గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం టీ, స్నాక్స్ తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, వీరోచనలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిలో 40 మంది పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి కొంచం విషమంగా ఉన్నట్టు సమాచారం.
