మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 16 :పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం గ్యాస్ ప్రమాదాలపై అగ్నిమాపక
శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. పట్టణంలోని శంకర్గం జ్, కునారం రోడ్, పలు అపార్ట్ మెంట్ల వద్ద గ్యాస్ సిలిండర్ల ,ద్వారా సంభవించే అగ్నిప్రమాదాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ అధికారి దేవనంది శ్రీనివాస్, సిబ్బంది ప్రజలకు వివరించారు. సిలిండర్ నుండి మంటలు చెలరేగితే ఆర్పివేసే
జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్ సిరాజోద్దీన్, డిఓపి శ్రీనివాస్, ఫైర్ మెన్లు శ్రావణ్ కుమార్, నరేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
