హైవే ఎక్కుతే హెల్మెట్ ధరించాలి

ఎస్ఐ అశోక్ హెచ్చరిక

హైవే ఎక్కుతే ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని , లేనట్లయితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. భీమారo మండల కేంద్రంలో శుక్రవారం హెల్మెట్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేనట్లయితే చర్యలు తీసుకోవడo తో పాటు హెల్మెట్ ఫైన్ వేయడం జరుగుతుందని తెలిపారు. వాహన దారులు హైవే ఎక్కుతే తప్పకుండా హెల్మ్ ట్ వెంట ఉండాలని తెలిపారు. హెల్మెట్ లేని వాహన దారులకు హెల్మెట్ ను కొనిపించారు. హెల్మెట్ ధరించారు. హెల్మెట్ లేక ఎంతో వాహన దారులు తమ ప్రాణాలని కోల్పోతున్నారని , రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను రక్షించుకోవచ్చని పిలుపునిచ్చారు. హెల్మెట్ లేని డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. మాది లోకల్ మేము హెల్మెట్ పెట్టుకొము అనేది ఉండవద్దని ప్రతి ఒక్కరికి హెల్మెట్ అనేది ఒక్క ప్రాణ కవచo గా మాత్రమే చూడాలని సూచించారు. ఆంటే కాకుండ హెల్మెట్ ధరించుటకు కు లోకల్ నాన్ లోకల్ లేదని తెలిపారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించడo నేర్చుకోవాలన్నారు.