మహా వెలుగు ,హైదరాబాద్ 25 : హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఈస్ట్ ఆఫ్రికాలోని మాలవి దేశానికి చెందిన ప్రయాణికురాలి వద్ద హెరాయిన్‌ను గుర్తించిన డీఆర్ఐ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఖతర్ నుంచి వచ్చిన విమానంలో నైరోబి దోహా మీదుగా ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది. బిజినెస్ వీసా ద్వారా ప్రయాణించిన ఆమె.. 2 పాలిథిన్ కవర్లలో 3.129 కిలోల హెరాయిన్‌ను తీసుకొచ్చింది. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ. 21.9 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసుశంషాబాద్ ఎయిర్‌పోర్టులో 21.9 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు.. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
