హైదరాబాద్ లో మరో పరువుహత్య : యువకుడిని 20 సార్లు పొడిచి చంపిన అమ్మాయి బంధువులు

మహా వెలుగు , హైదరాబాద్ 20 : తెలంగాణ లో వరుస పరువు హత్యలు కలకలం రేపాయి. కొద్దిరోజుల క్రితం సరూర్‌నగర్‌లో నాగరాజు హత్య ఘటనను మరిచిపోకముందే బేగంబజార్‌లో నీరజ్ పన్వార్‌గా గుర్తించారు.
హైదరాబాద్‌: నగరంలో సరూర్‌నగర్‌ పరువు హత్య మరువక ముందే.. మరో ఘటన ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌ బేగంబజార్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని అంతా చూస్తుండగానే.. అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు దుండగులు. 

షాహీనాథ్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని నీరజ్‌ పన్వార్‌గా గుర్తించారు. ఏడాది క్రితమే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్ష పెంచుకుని యువతి బంధువులే ఈదాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు నీరజ్‌ కుటుంబీకులు.

బేగంబజార్‌ మచ్చి మార్కెట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నీరజ్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో నలుగురు పాల్గొని.. నీరజ్‌ను 20సార్లు పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సీసీ కెమెరాల్లోనూ ఈ దాడి దృశ్యాలు నమోదు అయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది.