మహా వెలుగు, రిపోర్టర్ గోపాలకృష్ణ జన్నారం సెప్టెంబర్ 25 ఖానాపూర్ నియోజకవర్గం జన్నారం మండలం లో గల స్లేట్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని జాదవ్ స్నేహ,దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో సీటు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యనభ్యసించి ఆలిండియా ఐఐటి లో ఎస్టీ జాబితాలో 449వ ర్యాంకు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని స్నేహ ను తల్లిదండ్రులు, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఏ.జోబీన్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.