ఇంట్లో ఉన్న బండికి పోలీస్ చాలన్

  • విస్తూరు పోయిన ద్విచక్ర యజమాని
  • పోలీస్ ల తెలియని తనం గందరగోళం

హోమ్ లొ ఉన్న బైక్ కి చలన
మహా వెలుగు , మంచిర్యాల 06 : ఇంట్లో బండికి పోలీస్ లు చాలన్ వేశారు. అది ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనంకు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమారo గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన sccl సింగరేణి పరీక్ష రాసేందుకు TS 19 C 8994 హోండా షైన్ ద్విచక్ర వాహనం ఇంట్లో పెట్టి వెళ్ళాడు. సాయంత్రం 6 : 40 నిమిషాలకి ఫోన్ కి మెసేజ్ రాగ పరిశీలించారు. మెసేజ్ ఓపన్ చేయగానే తమ బండి దొంగతనం గురి అయిందని భయాందోళనకు గురై ఇంట్లో వారికి ఫోన్ చేసి అడుగగా బండి ఇంట్లోనే ఉందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దింతో కంగు తిన్న సదరు యువకుడు పూర్తి మెసేజ్ చదవగా డియర్ సార్ /మేడం వెహికల్ నెం.టిస్ 19C8994 ఇన్వొల్వెడ్ ఇన్ ట్రాఫిక్ వైయలేషన్ , ఫైన్ ఇంపాస్డ్ rs 300.0 ఫర్ విత్ అవుట్ హెల్మెట్ /నాట్ వెయిరింగ్ హెల్మెట్ బై రైడర్ , W/O కారియింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ON 4.SEP.2022 18: 35 HRS AT సీసీసీ కార్నర్ ,సీసీసీ నస్పూర్అ ని రాసి ఉంది.

పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా తప్పుడు చలన్ ను వస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనం రామగుండం కమిషనర్ రేట్ పరిధి లో ఇలా రావడం శోచనీయం అని దీనికి ఆ యువకుని చాలన్ రద్దు చేయాలని కోరుతున్నారు.