మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూలపల్లి వద్ద రోడ్డు ప్రమాదo సంభవించింది. మంచిర్యాల – చెన్నూర్ 63 వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో ముదిగుంట గ్రామానికి చెందిన పసులూటి (40) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. జైపూర్ ఎస్ఐ రామకృష్ణ ,తెలిసిన వివరాలు ప్రకారం .. ముదిగుంట గ్రామానికి చెందిన కుమార్ ఆటో నడుపుతూ జీవనాన్ని గడుపుతున్నారు. ఈ క్రమo ఆటో తీసుకొని మంచిర్యాల కు వెళ్లిన కుమార్ సాయంత్రం తిరిగి ముదిగుంట ఇంటికి వస్తుండగా ,భీమారo మండలం లో మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఉపాద్యాయురాలు కార్ నడుపుతూ మంచిర్యాల కు వెళ్తుండగా రసూల్పల్లి సమీపంలో కారు లారీని ఓవర్ టేకు చేస్తుండగా కార్ ఆటోను డీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ కుమార్ ను ,మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లుగా తెలిపారు. కొద్దిసేపట్లో ఇళ్లు చేరాల్సిన కుమార్ ఊహించని విధాO గా ప్రమాదం చోటు చేసుకొని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. మృతు డికి భార్య లక్ష్మీ , ఇద్దరు కొడుకులు ,ఒక్క కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.