జల్సాలకు అలవాటు పడి పోలీసులకు చిక్కి

మహ వెలుగు జూలై 31: ఉమ్మడి వరంగల్ సహా హైదరాబాద్ బీదర్ వంటి ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్రవాహనా లే టార్గెట్ గా చోరీకి పాల్పడుతున్న ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శనివారం మీడియాకు తెలిపిన వివరాలు మేరకు…సంగారెడ్జి జిల్లా పటాన్‌చెరుకు చెందిన షిండే జితేందర్, షిండే అశోక్, హనుమకొండ పద్మాక్షి కాలనీ కి చెందిన షిండే ఈశ్వర్ ముగ్గురు వరుసకు సోదరులు అవుతారు. జితేందర్ బైక్

మెకానిక్‌గా పని చేస్తుండగా.. మిగతా ఇద్దరూ కూలి పనులు చేసుకునేవారు

జల్సాలకు అలవాటు పడ్డ వీరు తమకు వచ్చే ఆదాయం సరిపోక, సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముకోవాలని ప్రణాళిక వేశారు. ఈక్రమంలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైకులను, పటాన్‌చెరు ప్రాంతంలో నాలుగు బైకులను బీదర్‌లో ఒక వాహనాన్ని చోరీ చేశారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను హనుమకొండలోని ఈశ్వర్ ఇంటిలో ఉంచారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండడంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.