పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం


మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ గోపాల కృష్ణా జన్నారం జూన్ 5 : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1994-95 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం రోజు సమ్మేళనం అయ్యారు.27 సంవత్సరాల తరువాత అందరూ ఒక్క చోట కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.ఇలా ఎన్నో సంవత్సరాల తరువాత , ఎంతో పని ఒత్తిడిలో ఉన్నా కూడా అదే ఉత్సాహంతో వారి పనులను పక్కన పెట్టి తమ కుటుంబాలతో సహా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరిలో ఆనందోత్సాహాలు నింపారన్నారు.

ఈ సమ్మేళనములో ఉపాధ్యాయులు గంగన్న,పూదరి సత్యనారాయణ,పల్లెర్ల మనోహర్, సత్తయ్య,నిర్మల,రజినీ లు పాల్గొన్నారు