మహా వెలుగు , జన్నారం, ఆగష్టు 01:మండలం దేవుని గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల చెర్లపల్లి గ్రామంలో సోమవారం రోజున మధ్యాహ్నం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి నుండి ముర్రుపాలు తాగించడం వలన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం శిరీష గోపాల్ రెడ్డి, ఐ సి డి సి సూపర్వైజర్ పద్మ, అంగన్వాడి టీచర్లు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు