మహావెలుగు కురవి/ఏప్రిల్22 రిపోర్టర్ చల్ల వేణు : ముంబాయి లో కంగారుస్ సంస్థ వారు నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్, కార్టూన్ మేకింగ్ మరియు మేహేంది పోటీలలో కాంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు జి. యశ్వంత్ తృతీయ బహుమతి, బి.హారిక, జి.రాజేష్, జి.నమ్రత లకు లిటిల్ స్టార్ అవార్డులు దక్కాయి.

ఈ అవార్డులను ప్రధానోపాధ్యాయులు కె. లక్ష్మినారాయణ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ. తోట శోభారాణి రమేశ్ గారు విద్యార్ధులకు అందజేశారు. డ్రాయింగ్ మాస్టర్ బాలరాజు గారికి “కళా మిత్ర అవార్డు”, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి “ఎడ్యుకేషనల్ రిఫార్మర్ అవార్డు”, పాఠశాలకు “మోస్ట్ ఆక్టివ్ స్కూల్” అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాద్యాయులు శంకర్,శాంత కుమారి, మంజుల దేవి, దత్త ప్రసాద్, వజ్ర కుమారి, శ్రీలక్ష్మి, గీత కుమారి, క్రిష్ణాకర్, సోమేశ్వర్,విష్ణు, రమేశ్, నూర్జహన్, శ్రీకరి, సర్వేష్ పాల్గొన్నారు.
