మహా వెలుగు ; సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ CUET(UG)-2022 కు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఇంకా పరీక్షను జులై మొదటి, రెండవ వారంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్షరెండు స్లాట్లలో నిర్వహించనున్నారు. స్లాట్ 1 కు సంబంధించి 3 గంటల 15 నిమిషాల సమయం(195 నిమిషాలు) ఉంటుంది. స్లాట్-2 కు సంబంధించి 3 గంటల 45 నిమిషాల(225 నిమిషాల) సమయం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్/అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.
జనరల్-EWS/OBC-NCL అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉం…
