జూన్ 4న డిజెఎఫ్ జర్నలిస్టుల మహాసభ

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా న్యూస్ రిపోర్టర్ చంద్ర కాంత్ 31 : జనహితమే లక్ష్యంగా పని చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనని డిజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ నారమళ్ల అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన డిజెఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డిజెఎఫ్ జర్నలిస్టుల మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విజయ్ కుమార్ నారమళ్ల మాట్లాడుతూ…

దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా చిన్న, పెద్ద జర్నలిస్టులు అంటూ తారతమ్యం లేకుండా పోరాటమే మార్గంగా ఏర్పడిన ప్రగతిశీల పాత్రికే య ఐక్య కూటమి డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని తెలిపారు. జూన్ 4న హైదరాబాద్ లో జరగనున్న డిజెఎఫ్ జర్నలస్టుల మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల్లో పనిచేసే జర్నలిస్టులంతా తరళి రావాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ చిన్న, మధ్య తరగతి, పెద్ద పత్రికలు, కేబుల్, డిజిటల్, వెబ్, యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్,విద్య, వైద్య సదుపాయాలు, ఇంకా అనేక రకాలైన సమస్యల సాధన కొరకు నిర్మాణాత్మకంగా, సంఘటితంగా డీజేఎఫ్ పోరాటం చేస్తుందన్నారు.

భవిష్యత్ లో డీజేఎఫ్ దేశంలోనే ఒక బలమైన జర్నలిస్ట్ యూనియన్ గా ఏర్పడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా డిజెఎఫ్ జర్నలిస్టుల పక్షాన నిలబడి తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలిపారు. జిల్లాలో డిజెఎఫ్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి దశ, దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిజెఎఫ్ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహర్షి మల్లన్న, జిల్లా కోఆర్డినేటర్ జక్కే రాజకుమార్ సభ్యులు గుర్రం పరుశురాం, కోమ్మగల్ల బాబు, బాలసాని కుమార్, వడ్లూరి రాజేశ్వర్ రావు, బెజ్జాల ప్రభాకర్, దొంతనవేణ రాజు, పోతుల జాన్, నూతి రవీందర్ తదితరులు పాల్గోన్నారు.