ఖాకీ వనంలో కామాంధులు అమ్మాయిల కోసం వేట జాబ్ ఇప్పిస్తానంటూ యువతిపై ఎస్‌ఐ అరాచకం

మహా వెలుగు , హైదరాబాద్ 12 : తెలంగాణ పోలీసుశాఖ లో పని చేస్తున్న కొందరు కామాంధుల్లో ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మొన్న మారేడ్‌పల్లి సీఐ శ్రీనివాస్ , నిన్న మల్కాజ్‌గిరి సీసీఎస్‌ ఎస్‌ఐ ధరావత్‌ విజయ్‌కుమార్‌..ఇవాళ కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బన సబ్‌ ఇన్స్‌పెక్టర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆడవాళ్లు, యువతుల పట్ల కామపిశాచాల్లా తయారయ్యాయి. పేద తనం ఆసరాగా చేసుకుని వల విసురుతున్నారు. నిరుద్యోగo చూసి మాయమాటలు చెప్తున్నారు… ఏకంగా నీకు సెక్స్ పై ఎలాంటి ఒపీనియన్ ఉందని అడిగి తెలుసుకుంటున్నారు.తమ శారీరక కోరిక తీర్చమని లేదంటే చంపేస్తామని లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న పోలీసుల జాబితాలో మరొకరి పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది.

మూడో కామాంధుడు..

గత రెండ్రోజులుగా ఇద్దరు పోలీసు అధికారుల రసిక రహస్యాలు బయటపడుతున్న సమయంలోనే మరో పోలీస్ అధికారి అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన కు చెందిన ఓ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీస్ ఇద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి ట్రాప్ చేశాడు. ఆమెకు ఎస్‌ఐ ఫోన్ చేసి పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించుకొని ఉద్యోగానికి అవసరమై మెటిరియల్స్, పుస్తకాలు ఇస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అంతే కాదు బాధిత యువతికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చేలా చూస్తానంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు..

ఖాకీ డ్రెస్‌ వేసుకున్న కామాంధుడి టార్చర్ భరించలేక ..అతను చెప్పినట్లు చేయడం ఇష్టం లేని యువతి విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పుకుంది. ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐపై గతంలో కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది. యువతి ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు వాళ్లు చూపించిన ఆధారాల ప్రకారం ఎస్‌ఐని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆ ఎస్ఐ ని అటాచ్ చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎస్ఐ భార్య సూసైడ్

ఆరోపనలు ఎదుర్కొంటున్న ఎస్ఐ భార్య సూసైడ్ చేసుకుంది… కాగా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.