కల్లుగీత కార్మికుని ఆదుకున్న టాడి కార్పొరేషన్

వి. కపిల్ కుమార్,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబబాద్/బయ్యారం- 29 :మహబూబబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు మొగులగాని వెంకటయ్య,వృత్తిరీత్యా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాద వశాత్తూ జారిపడి మరణించగా వారికి దహన ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా 25,000 రూపాయల చెక్కుని టాడి కార్పొరేషన్ నుండి మంజూరు కాగా శుక్రవారం మానుకోట జిల్లా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న బాధిత గీతా కార్మికుడైన మొగులగాని వెంకటయ్య, కుటుంబానికి చెక్కుని అందజేసారు
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కల్లు గీత కార్మికుడు వృత్తి ప్రమాదంలో చనిపోయిన విషయం తెలియగానే వెంటనే స్పందించి సహకరించిన బీసీ కార్పొరేషన్ చైర్మన్/ ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్రా వెంకటేశం ఐఏఎస్, ఎక్సైజ్ శాఖ మాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్,కార్పోరేషన్ యం.డి ఉదయ్ ప్రకాష్,మహబూబాబాద్ బిసి కార్పోరేషన్ డి ఓ నర్సింహా స్వామి,కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ లకు వారి కుటుంబ సభ్యులు మరియు కల్లుగీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తంనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు మండ రాజన్న, సర్పంచ్ బానోత్ లీలమ్మ , జిల్లా కమిటీ సభ్యులు పంజాల ఉపేంద్ర, బయ్యారం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు జుజూరి శ్రీను, బసవ విశ్వనాథం, కందునూరి పూర్ణయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.