కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత

  • ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్

మహా వెలుగు కురవి మే 18 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్

వారు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేద ఇంటి ఆడ పిల్లల కు వరమని మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.

కురవి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు కోటి 32 లక్షల 15 వేల 312 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీచైర్మన్ బజ్జురి ఉమ పిచ్చి రెడ్డి, మండల ఎంపిపి గూగులోతు పద్మ రవి నాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య,జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, జిల్లా టిఆర్ఎస్వి నాయకులు గుగులోతు రవి నాయక్, మండల అధ్యక్షులు తోట లాలయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ముళ్ళ రమేష్, కో ఆప్షన్ సభ్యులు షేక్ యాకుబ్బీ, సొసైటీ చైర్మెన్ దొడ గోవర్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, తాసిల్దార్ ఈమ్యానుల్, ఎంపీడీవో సరస్వతి, సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షులు ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రాము నాయక్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, గణేష్, ఎంపీటీసీ భాస్కర్, వివిధ గ్రామ సర్పంచులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.