ఖని ని దిగ్భంధించిన పోలీసులు.! 83 మోటర్ సైకిళ్లు, 5ఆటోలు స్వాధీనం


మహా వెలుగు, రామగుండం ఏప్రిల్ 13: రామగుండం గోదావరిఖని కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విట్టల్ నగర్ సిక్ హస్పటల్, ధూల్ పేట, పోచమ్మ గుడి పరిసరాల్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో అనుమానిత మోటార్ సైకిళ్లు, ఆటోలు తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ హాజరయ్యారు అయిన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనుమానిత వ్యక్తులు సంచరించిన, ప్రభుత్వ నిషేధిత గంజాయి మత్తు పదార్థాలు సేవించిన గుట్కా, తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు యువతకు సూచించారు. అలాగే వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు ఇన్సూరెన్స్, నెంబర్ లేని వాహనాలతో ప్రయాణం చేయడం నేరమని, అలా రోడ్డుపై తిరిగితే వారిపై కఠిన చర్యలు, జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజల భద్రత రక్షణ కల్పించడమే బాధ్యతగా ఈ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని నేర రహిత చేయాలని పోలీసులు భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకు ఈ ప్రాంత యువత, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు లేని 83 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని రెండు వేల రూపాయల గుట్కా సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజ్ కుమార్ గౌడ్, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాసరావు, ఎస్ డి అబ్జలోద్దీన్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.