కానిస్టేబుల్‌ వేధింపులు తట్టుకోలేక యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య

మహా వెలుగు ,శాయంపేట : కానిస్టేబుల్‌ వేధింపులు తట్టుకోలేక యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌లో చోటుచేసుకుంది.

మంగళవారం ఎస్సై వీరభద్రరావు మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. తహరాపూర్‌కి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్‌ పర్యవేక్షకురాలిగా పనిచేస్తున్నారు. హనుమకొండ ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సర్వేష్‌ యాదవ్‌ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ … సంగీతకు అతను తరచూ ఫోన్‌ చేసి వేధించేవాడు. కానిస్టేబుల్‌ వేధింపులు తట్టుకోలేకపోయిన సంగీత గత సోమవారం రోజువారీ విధులను ముగించుకుని ఇంటికొచ్చింది. పురుగులమందు తాగి తన సోదరికి తెలిపింది. వెంటనే కుటుంబీకులు ఆమెను పరకాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మఅతురాలి తండ్రి వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.