రానున్నది షర్మిలమ్మ రాజ్యం

రానున్నది షర్మిలమ్మ రాజ్యమని కాశీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపును ఇచ్చినందుకు గాను బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో లో కేకు కోసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా షర్మిలమ్మ రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాజ్ పాషా సురేష్ ,కిరణ్ ,వంశీ, నరేష్ ,ఉదయ్ మహిళా నాయకురాలు రహీమ్ ,లక్ష్మీ లు పాల్గొన్నారు.