మహా వెలుగు హైదరాబాద్ 12 : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఖరీదైన అపార్ట్ మెంట్ లోని గుట్టుగా వ్యభిచారం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ప్లాట్ పై దాడి చేసారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా నిర్వహకుడు పరారయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ ఆదర్శనిలయం అపార్ట్ మెంట్ లో ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్యామిలీస్ నివాసముండే ఈ అపార్ట్ మెంట్ లో 501 ప్లాట్ లో గలీజ్ దందా సాగిస్తున్నాడు. సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా విటులను ఆకర్షించేవాడు. వారినుండి భారీగా డబ్బులు వసూలుచేసి కోరుకున్న అమ్మాయిలతో ప్లాట్ కు పంపేవాడు.
అయితే ఈ ప్లాట్ లోకి ఎవరెవరో వస్తుండటంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సదరు ప్లాట్ పై నిఘావుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్లాట్ పై దాడి చేయగా మహబూబ్ నగర్ జిల్లా అనంతవరం మండలం అంబగిరి గ్రామానిక చెందిన బాలు(37), రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం చిలకమర్రికి చెందిన కృష్ణయ్య (46) తో పాటు ఇద్దరు మహిళలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే నిర్వహకుడు ప్రభాకర్ రెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు.
ఈ వ్యభిచార దందాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విటులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే పట్టుబడిన ఇద్దరు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. పరారీలో వున్న నిర్వహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
