మహా వెలుగు, చెన్నూర్ 15 : చెన్నూరు మండలం గంగారం గ్రామంలో కెసిఆర్ చిత్రపటానికి అక్కడికి రైతులు ధాన్య అభిషేకం నిర్వహించారు.. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ… చెన్నూర్ కి సంబందించి మూడు లిఫ్టులకుగాను రూ.1658 కోట్ల మంజూరు చేసినందుకు , దేశ చరిత్రలో ఏ ముఖ్య మంత్రి తీసుకొనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గాను రైతు నుండి ప్రతి గింజను కెసిఆర్ సర్కార్ కొనుగోలు చేస్తున్నందుకు గాను ధాన్యాభిషేకం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు.
