KCR వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం

Telangana State వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలపై తాము ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం పదవిలో ఉండి కేసీఆర్ అబద్దాలు చెప్తున్నారని పేర్కొంది. ఫలానా వారి దగ్గర పునరుత్పదక విద్యుత్ కొనాలని కేంద్రం ఎప్పుడు చెప్పడం లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ,పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ. 55 వేల కోట్ల అప్పు ఇచ్చాయని ,దీనికి కేసిఆర్ రుణపడి ఉండాలని పేర్కొంది.