కేసీఆర్ మమ్మల్ని వాడుకోవటంలేదు..మేమే కేసీఆర్ ను వాడుకుంటున్నాం: తమ్మినేని

మహా వెలుగు హైదరాబాద్ 01: ”మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ మమ్మల్ని వాడుకోవడం లేదు.మేమే కేసీఆర్‌ను వాడుకుంటున్నాం” అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.గురువారం మాట్లాడుతూ… మునుగోడులో బీజేపిని ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంటే వాళ్ళకే మద్దతిచ్చేవాళ్ళమని తెలిపారు.బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.”రేపు కూడా కేసీఆర్ మమ్మల్ని తోక పార్టీ అని విమర్శించవచ్చు కేసీఆర్ మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకోవడం లేదు”అని అన్నారు.బీజేపీతో కేసీఆర్ ఒకరోజు మిత్రునిగా, ఒకరోజు శత్రువుగా ఉంటారన్నారు. బీజేపీతో శాశ్వత శతృత్వం తమదే అని తెలిపారు.”మా మద్దతు కేవలం మునుగోడు వరకే” అని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.