మహా వెలుగు మంథిని : కాళేశ్వరమును ,నియోజకవర్గం లోని పురాతన దేవాలయములను పర్యాటక సాంస్కృతిక శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని
ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డిని ఢిల్లీ లో కలిసి వినతిపత్రం
అందజేశారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ….
కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి కార్యాలయంలో కలిసినట్లు వారు పేర్కొన్నారు. రామగిరి ప్రముఖ పురాతన క్షేత్రమైనరామగిరి ఖిల్లాను పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.మంథని నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంకి ప్రసాద్ పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గ oలోని పలు దేవాలయాలను అభివృద్ధి చేయాలని పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా వాటికి ప్రత్యేక నిధుల కేటాయించాలనీ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.
