కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 30 : పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు, కోనరావుపేట, వెంకట్రావుపల్లి, పెద్దాపూర్, కాచాపూర్, వడ్కాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దాసరి కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, మార్కెట్ ఛైర్మెన్ కంది చొక్కారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు పుల్లూరి వేణుగోపాల్రావు, కొంజర్ల వెంకటయ్య వైస్ ఎంపీపీ మొగురం రమేష్, పాక్స్ వైస్ ఛైర్మెన్ కంది మల్లారెడ్డి సర్పంచ్ లు బంటు ఎల్లయ్య, తిరుపతి, ఎంపీటీసీ శ్రీలత కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు కన్నం రమేష్, శంకర్, రైతు బంధు కో ఆర్డినేటర్ భగవంతరావు, మాజీ సర్పంచ్ కృపాకర్ రావు, మాజీ ఎంపీటీసీ రాములు, డైరెక్టర్లు సమ్మయ్య, తెరాస నాయకులు రేచవేని సతీష్, అంతయ్య, దాడి మల్లేశం, కొమురయ్య, దేవానందుల మల్లయ్య, అడప లక్ష్మణ్, జెట్టి సతీష్, రైతులు పాల్గొన్నారు.