క్షతగాత్రులను స్వయంగా లేపి ఏమైనా దెబ్బలు తాకాయ… ? ఎలా ఉన్నారు…? ఎక్కడికి వెళ్ళాలి మీరు ….?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్ఐ చేయూత..

మహా వెలుగు , భీమారo 22 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్ఐ చేయూతనిచ్చారు.
మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారి పై స్థానిక పోలంపల్లి సమీపంలో ని చెప్యాల ఆగ్రో ఫారం వద్ద కారు ద్విచక్ర వాహనం ను ఢీ కొట్టగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి.

క్షతగాత్రులను లేపుతున్న ఎస్ఐ అశోక్ వారి సిబ్బంది

దీనితో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న భీమారం ఎస్ఐ అశోక్ సంఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రులను స్వయంగా లేపి ఏమైనా దెబ్బలు తాకాయ… ? ఎలా ఉన్నారు…? అని తెలుసుకొని వారిని ఓదార్చి అదే కార్ లో మంచిర్యాల కు తరలించారు. క్షతగాత్రులను స్వయంగా తమ సిబ్బందితో తామె పట్టుకొని పరిశీలించి వారిని ఇంట్లో కుటుంబ సభ్యులు లాగా మంచిర్యాల తరలించారు.. దీన్ని చూసిన కొందరు ప్రయాణికులు ఎస్ఐ చేసిన పనికి ఎస్ఐని పలువురు అభినందిస్తున్నారు