మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 24 : పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో క్షయ వ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా గురువారం ఓదెల పీహెచ్‌సీ వైద్యాధికారి లావణ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు సూచనలు చేశారు. అనంతరం క్షయ వ్యాధి నివారణ దిశగా ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో సీహెచ్‌ఓ రవీంద్రకుమార్, హెచ్‌వీ క్రిస్టియానా, హెచ్‌ఎస్ సుధాకర్, కేజీబీవీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
