- మహా వెలుగు కథనానికి స్పందన
మహా ,వెలుగు ,భీమారo 30 : భీమారo మండల కేంద్రo లో ని స్థానిక బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ చలి వేంద్రం కుక్కలకు అవాసంగా మారిందని మహా వెలుగు లో ప్రచురణ చేయగా కొద్దీ నిమిషాల్లోనే పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ స్పందించారు. చలి వేంద్రం లో నీళ్లు పోసేందుకు గ్రామ పంచాయతీ నుండి వ్యక్తిని ఏర్పాటు చేశారు. అక్కడ పరిశుభ్రంగా ఉంచారు. చలి వేంద్రం ను ఇక నుండి పరిశుభ్రంగా ఉంచనున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.