కాంగ్రెస్ పార్టీ కురవి మండల మహిళా అధ్యక్షురాలు గా మాలోత్ వినోదసురేష్ నాయక్

మహావెలుగు కురవి/ఏప్రిల్30 రిపోర్టర్ చల్ల వేణు

కురవి మండలం రాజోలు గ్రామ శివారుకి చెందిన హరిదాస్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మాలోత్ వినోదసురేష్ ను నియమిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీత రావు, మానుకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నునవత్ రాధా చేతుల మీదగా మాలోత్ వినోదసురేష్ నాయక్ ను నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా మీద నమ్మకంతో మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షులురాలుగా పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్య నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ సిద్ధాంతాలను లోబడి క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి లాలూ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డివై గిరి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జెర్రిపోతుల రంగన్న గౌడ్, జిల్లా నాయకులు శ్యామల శ్రీనివాస్,ఎడ్ల వెంకన్న, జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు గంట యకేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.