కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు

  • పిడి ఎస్ యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్

మహావెలుగు కురవి/మే14 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎస్సీ హాస్టల్ సొంత భవనం నిర్మించాలని పిడిఎస్ యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పిడిఎఎస్ యూ జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఎస్సీ హాస్టల్ పిల్లలు అద్దె భవనంలో కొనసాగడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలికల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎస్సీ హాస్టల్ శాశ్వత భవనం నిర్మించాలని , మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, వంటి ఇతర నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన దరిద్ర పరిస్థితి మన కురవి మండలం కేంద్రంలో ఉందన్నారు.

ఒక స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఉన్న కూడా కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ ఎస్సీ హాస్టల్ సొంత భవనం లేకపోవడం సిగ్గుచేటని తను ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మంత్రి ఉన్న విద్యా సంస్థల అభివృద్ధి మాత్రం శూన్యం మండల కేంద్రంలో ఉన్న రెవెన్యూ భూముల్లో కళాశాలతో పాటు ఎస్సీ హాస్టల్ సొంత భవనం నిర్మించాలని పిడిఎస్యు జిల్లా నాయకులు బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు.

మండల కేంద్రం ఏర్పడి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటిదాకా జూనియర్ కాలేజ్ మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.అలాగే మండలంలోని దాదాపు రెండు వేల మంది విద్యార్థుల పై చదువుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లలేక మధ్యలోనే చదువు ఆపేసిన పరిస్థితి ఉందన్నారు. మండలంలోని పేద విద్యార్థులకు చదువులు అందని ద్రాక్షగా అవుతుంది అన్నారు తక్షణమే జూనియర్ కాలేజ్ ని ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భుక్య సతీష్, నవీన్, లోకేష్, ప్రకాష్, జైపాల్, సంతోష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.