డ్రైనేజీల అసంపూర్తి నిర్మాణంతో ముప్పు

మహా వెలుగు ,భీమారo 7 : మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో లారీ కి ముప్పు తప్పింది.. మంచిర్యాల వైపు నుండి జాతీయ రహదారిపై చెన్నూరు వైపునకు ప్రయాణిస్తుంది. భీమారం రాగానే లారీ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలో కల్వర్ట్ లో కూరుకుపోయింది. దీంతో లారీ డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. భీమారo లో మూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు నడుస్తున్నాయి. డ్రైన్ పనులు గత రెండు సంవత్సరాల క్రితం నిర్మించారు. కానీ పనులు మాత్రం పూర్తి చేయకపోవడంతో ఏదో ప్రమాదం జరుగుతుంది. అక్కడున్న కాలనీవాసులు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు సమస్య విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేస్తేనే ప్రమాదం జరిగకుండ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

దిగబడిన లారీ

కాంట్రాక్టర్లకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగ రానిది జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని , రానున్నది వర్షాకాలం కావడంతో మరింత ఇబ్బందులు తప్పవని వారు తెలుపుతున్నారు.