- భీమారం ఎస్ ఐ జి. సుధాకర్
మహా వెలుగు , మంచిర్యాల భీమారం 13 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలని భీమారం ఎస్ఐ జి సుధాకర్ పేర్కొన్నారు.
మండలంలోని మద్దికల్ గ్రామం లో సోమవారం యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలని లోన్లీ యాప్ లపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు. లోన్ యాప్ ద్వారా ఎంతో మంది యువత మరణిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం అక్కడున్న యువతకి వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వోడేటి వాణి మాజీ సర్పంచ్ రమేష్ పోలీస్ సిబ్బంది రవి మాచర్ల హోంగార్డు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.