- కుమ్మరి దుర్గవ్వది మా నియోజకవర్గం ,మా మంచిర్యాల
భీమ్లా నాయక్ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్, సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది. ‘సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్ అయ్యాయి. అది విని భీమ్లానాయక్‌లో పాట పాడమని ఆఫర్ వచ్చింది. ఐదారు నిమిషాల్లో పాడేశాను. ఈ పాట పాడినందుకు రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు’ అని చెప్పుకొచ్చింది దుర్గవ్వ. కగా దుర్గవ్వ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఫ్రీ – రిలీజ్ షోలో నటుడు పవన్ కళ్యాణ్ , ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వేదికపై ఉండగా దుర్గవ్వ మాది మంచిర్యాల , చెన్నూర్ నియోజకవర్గం ,కోటపల్లి మండలం రొయ్యల పల్లి ,అనే మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి దీనితో మంచిర్యాల ప్రజలు దుర్గవ్వను శోషల్ మీడియా వేదికగా అభినందించారు..