- సినిమా ను తలంపించిన సంఘటన.
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/బయ్యారం.8 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం లో గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మద్యం మత్తులో శనివారం అర్థ రాత్రి స్పీడుగా కారు నడుపుతూ బైక్ ను ఢీ కొట్టి, బైక్ నడుపుతున్న అతనిపై దాడి చేయబోతున్డగా,మరో వాహన దారుడు దీనిని అడ్డుకోగా వారిపై దాడి చేసి రోడ్డుపై సినిమాను తలపించే విదంగా వీరంగం చేసినట్లు సమాచారం….
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….. మండల కేంద్రంలో గాంధీ సెంటర్ సమీపంలో కాకతీయ నగర్ వెళ్లే రోడ్డు మార్గంలో ఎదురుగా టు వీలర్ వాహనం వస్తుండగా కారు నడుపుతున్న రాజేష్ మద్యం మత్తులో ఢీ కొనగా టు వీలర్ వాహన దారులు క్రింద పడటం జరిగిందని, నేను కానిస్టేబుల్ ను ఎస్టీ అంటూ దాడికి దిగినట్లు సమాచారం విచ్ఛక్షణా రహితంగా దాడి చేయబోగా అదే దారిలో స్థానికులు కాని స్టేబుల్ వీరంగంను ప్రశ్నించగా హేమంత్ అనే ఆగి ఉన్న వ్యక్తినీ కారుతో డీ కొట్టగా అతను ప్రాణాపాయం నుండి బయట పడినట్లు తెలిపాడు.ఈ సంఘటన పై స్థానికులు 100 అత్యవసర సేవా విభాగంను ఫోన్ చేయగా బ్లూ కోట్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని సమాచారం రికార్డ్ చేసినట్లు తెలిసింది .
ఇతని పై భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లా లో రొంపేడు గ్రామంలో మద్యం షాపులో మద్యం ఇవ్వనందుకు షాపు యజమాని పై దాడి జరగడంతో సస్పెండ్ కు గురి అయినట్లు సమాచారం. అంతే కాకుండా గంజాయి స్మగ్లింగ్ చేస్థున్నాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
సమాజంలో నలుగురికి రక్షణ కల్పించే కానిస్టేబుల్ ఈరకంగా వ్యవహరించడం హేయమైన చర్యగా స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసు పరువు తీస్థున్నారనే విమర్శలు ఉన్నాయి.
