మహా వెలుగు ,మంచిర్యాల 13 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోనీ పిన్నారం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు జనగామ గ్రామానికి వివాహానికి వెళ్లే మార్గమద్యంలో రొయ్యలపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి రాజపోశం అనే వ్యక్తి మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం..

ఆటో నడుపుతున్న అదే గ్రామానికి చెందిన కుబీర్ మద్యం మత్తులో ఆటోను తొలినట్లు స్థానికులు తెలుపుతున్నారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

