మహనీయుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

మహా వెలుగు, పెద్దపల్లి జిల్లా 11 :మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగాతీసుకోవాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్య నారాయణ తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే 196వ జయంతి సందర్భంగా సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి,మహాత్మ భాపూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జ్యోతిబాపూలే 1827 ఏప్రిల్ 11 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించాడని, మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, కుల వ్యవస్థ పూర్తిగా. నిర్మూలించిన నాడే అభివృద్ధి సాధ్యమవుతుందని, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మసైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపూ లేనని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కుమార్ దీపక్ , జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రంగారెడ్డి, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బొంకురి శంకర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.