మహా వెలుగు, చెన్నూర్ : మహా నీయుడు బాబు జగ్జీవన్ రాం అని మంత్రి మల్లేష్ పేర్కొన్నారు. చెన్నూర్ పట్టణం లోని అంబెడ్కర్ విగ్రహాం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ (ఏప్రిల్ 5, 1908 జననం – జులై 6, 1986 వీర మరణం) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడని. అతను బాబూజీగా ప్రసిద్ధుడు అయినట్లు వారు తెలిపారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడని 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్రను పోషించినట్లు వెల్లడించారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.
1946లో, అతను జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడని.అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడని మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తగరపు వెంకటీ ,మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ ,గడ్డం మల్లయ్య తాటికొండ శ్రీనివాస్ వొల్లల రాజు , బైన వేణు చకినారపు మల్లేష్ , రాపాక మల్లేష్ వేముల రమేష్ , చకినారపు రాజేష్ ,తగరం శంకర్ చెన్నూరి శ్రీధర్ ,కొప్పర్తి గోవర్ధన్, విజయ్ కోయిల సందీప్ ,వేల్పుల సతీష్ ఎల్కటూరి రవీందర్ , మంద రవికుమార్ , నిట్టూరి లింగయ్య తగరం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
