మహా వెలుగు ,భీమారo : మండల కేంద్రంలో ఇసుక లారీ మహిళ పై దూసుకవచ్చిన సంఘటన సోమవారం ఉదయం నెలకొంది. TS 19 T 6989 గల ఇసుక లారీ మంచిర్యాల వైపు నుండి చెన్నూర్ వైపునకు అధిక స్పీడ్ తో వెళ్తుంది. మంచిర్యాల – చెన్నూర్ రహదారి పై మహిళ ఆవుడం వైపునకు రోడ్డు దాటుతుండగా ఓ మహిళ పై ఇసుక లారీ దూసుక రాగ మహిళను తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహిళ పేరు మానుగు పోసు( 48) చెన్నూర్ మండలం పొన్నారం , తల్లి గారి ఇల్లు నెన్నెల్ మండలం గంగారాం కాగ మంచిర్యాల వెళ్లేందుకు ఆటో పై వచ్చి దిగింది. మంచిర్యాల బస్సు ఎక్కేందుకు వెళ్లగా లారీ దూసుక వచ్చి పోసు ప్రాణం తీసింది. భర్త శ్రీనివాస్ ఉండగా రవళి ,నర్మదా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు సమాచారం..
