మంచిర్యాల జిల్లా లోనే ‘ఉత్తమ మహిళ ఉద్యోగి అవార్డు ‘ను ‘భీమారo మండలం కైవసం’ చేసుకుంది. మహిళ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ను అందుకొనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమారo మండలం ఎల్కేశ్వరం పంచాయతీ కార్యదర్శి గా 12 మార్చ్ 2019 సo లో శ్రావ్య బాధ్యతలు స్వీకరించిoది. దీనిలో భాగంగానే జిల్లాలోనే మొదటగా ఇంటి పన్నులు వసూళ్ళు , వంద శాతం పూర్తి చేసింది.జిల్లాలొనే వందశాతం వ్యాక్సిన్ ,రెండు డోసులు పూర్తి , గ్రామంలో పారిశుద్ధ్యo ,నర్సరీ ,పల్లె ప్రకృతి వనం ,హరితహారం , పల్లె ప్రగతి కార్యక్రమాలు అంకిత బావo తో సక్రమంగా నిర్వహించినందు కు గాను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఉత్తమ మహిళ ఉద్యోగి అవార్డు ను మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా అందుకోనుంది.