పాఠశాల విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిట్లు వచ్చిన ఆరోపణపై SGT ని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం

మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్, ఏప్రిల్ – 11:పాఠశాల విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిట్లు ఆరోపణలు వచ్చిన SGT టీచర్ ను వెంటనే సస్పెండ్ చేసినట్లు, అంతేకాకుండా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు పోలీస్ శాఖకు తెలియజేయడం జరిగిందని సోమవారం బాల రక్షా భవన్ లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ ఎస్. నాగవాని, జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి. అబ్దుల్ హై సంయుక్తంగా తెలిపారు.

మహబూబాబాద్ పట్టణంలో చదువుతున్న విద్యార్థిని కొన్ని రోజులుగా పాఠశాలకు రావడం లేదని, హాజరు కాకపోవడానికి గల కారణాలను కనుగొనేందుకు బాలిక ఇంటికి టీచర్ వెల్లి విచారించే సమయంలో మా చెల్లికి జ్వరం వచ్చింది అని, అమ్మా, నాన్న పనికి వెల్లినందున నేను ఇంట్లో ఉన్నానని తెలిపి, టీచర్ నిలబడి ఉన్నారని కుర్చీ తీసుకొచ్చి కూర్చోమని చెప్పడం జరిగిందనీ, ఈ సందర్భంలో బాలికపై అసభ్యంగా ప్రవర్తించి పెద్ద వాళ్లకు చెప్పవద్దని తెలిపి టీచర్ వెల్లారని, బాలిక నాయనమ్మ ఇంటికి వచ్చిన తర్వాత విషయం చెప్పగా, 1098 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారని, వెంటనే జరిగిన విషయాన్ని తెలుసుకొని డి. ఈ. ఓ. ఎండి. అబ్దుల్ హై బాల రక్ష భవన్ కు వెళ్లి బాలికతో మాట్లాడి వివరాలను తెలుసుకొన్నారు. బాలిక టీచర్ పై ఆరోపణలు చేయడంతో టీచర్ ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీచర్ పై చట్ట ప్రకారం చర్యల కొరకు పోలీసు శాఖకు తెలిపామన్నారు.

ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ ఎస్. నాగవాని, సభ్యులు డాక్టర్ డేవిడ్ వి. ఎలియా బాలికతో మాట్లాడి వివరాలు నమోదు చేశారు.