మహా వెలుగు పెద్దపల్లి 06 : పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్, ఎంపీటీసీ గుర్రం సంపత్ గౌడ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
