తెలంగాణ మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ ను ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా సొల్లు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాపాక అశోక్, శ్రీధర్, కోశాధికారిగా చిప్ప రమేష్, అధికార ప్రతినిధిగా సురేందర్ ,కార్యదర్శిగా యాసందుల రాము, అన్నారం మల్లేష్, జాయింట్ సెక్రెటరీగా భాస్కర్ రెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ,కందుగుల భూమేష్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, రామంచ నరేష్, సతీష్, ప్రదీప్, శ్రీకాంత్ లను నూతన కమిటీ గా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమయ్య పాల్గొని ఎన్నికైన వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయిస్ ని ఆదుకోవాలన్నారు. ఉద్యోగులు అందరూ కూడా ఐక్యంగా ఉండి హక్కులు కాపాడుకోవలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందిని ఐక్యం చేసి హక్కులను సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేట్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు
