మంథని డిపో మేనేజర్ గా తర్ల శ్రీనివాస్

మహా వెలుగు, మంథని :మంథని డిపో మేనేజర్ గా తర్ల శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిపో మేనేజర్ గా పనిచేసిన రవీంద్రనాథ్ మంచిర్యాల డిపో బదిలీపై వెళ్లి పోగా ముషీరాబాద్ వన్ డిపో లో పనిచేస్తున్న శ్రీనివాస్ మంథని కి బదిలీపై వచ్చారు. మంగళవారం ఆయనకు డిపో లో పనిచేస్తున్న
అధికారులు సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.